Neelambari Lyrical Song: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ విడుదల, పాటలో నీలాంబరిని తెగ పొగిడేశాడు సిద్ద, ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు చిరంజీవి ఆచార్య మూవీ
నీలాంబరి అంటూ సాగే ఈ పాట ప్రోమోను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఏ ప్రోమోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. (Acharya) ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది. ఇప్పటికే ఏ ఈసినిమానుంచి టీజర్, తోపాటు ఓ సాంగ్ ను (Lyrical song Neelambari) కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆచార్య నుంచి సెకండ్ సాంగ్ ను (Neelambari Lyrical Song) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
రామ్ చరణ్, పూజాహెగ్డే లపై ఈ పాటను చిత్రీకరించారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ప్రోమోను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఏ ప్రోమోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈపాటలో తన ప్రేయసి నీలాంబరిని తెగ పొగిడేశాడు సిద్ద. అందమైన లిరిక్స్ ఈపాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా అందంగా ఆలపించారు.
కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి,చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. అలాగే చిరుకి జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనుంది.