IPL Auction 2025 Live

MAA Elections 2021: నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా..నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం, మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్, సినిమాల్లోకి జాతీయవాదం తీసుకువచ్చారని ఆవేదన

అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ (Movie Artists Association)సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

A file image of Prakash Raj. | Image Courtesy: Facebook

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో (MAA Elections 2021) మంచు విష్ణు ప్రకాశ్‌ రాజ్‌పై విజయం సాధించిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌ ఘన విజయం సాధించగా, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం(అక్టోబర్‌ 11) హైదరాబాద్‌లోన దస్బల్లా హోటల్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఎన్నికలు చాలా చైతన్య వంతంగా జరిగాయి. గెలిచిన మా సభ్యులకు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ మీకు, నాకు తెలుసు. హామీలు అన్నింటినీ పూర్తి చేయడం ముఖ్యం. నా ప్రాంతం, జాతీయ వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. నేను తెలుగు బిడ్డనే, నేను ఒక కళాకారుణ్ణి’ అంటూ చెప్పిన అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా (Prakash Raj Resigns From MAA Membership) చేస్తున్నట్లు ప్రకటించారు

ఈ మేరకు ఆయన ‘గెలిచిన మంచు విష్ణు, అతడి ప్యానల్‌ సభ్యులకు శుభాకాంక్షలు. ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారని వాటన్నింటిని నెరవేర్చండి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం, గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ‘మా’ ఎన్నికలు రాజకీయ వేదిక కాదు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కానీ ఎవరెవరు నాకు ఓటు వేశారో తెలియదు. రాజకీయం, సినిమా రెండు వేరు అనుకుంటున్నా. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ (Movie Artists Association)సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు, ఓటమి పాలైన ప్రకాష్ రాజ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోరులో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ ఘన విజయం

అసోసియేషన్‌కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్‌ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. అలాగే ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు.

ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్‌ మెంబర్‌గా ఉండకూడదు. పెద్ద నటులు కోట శ్రీనివాస రావు, రవిబాబు వ్యాఖ్యలను గౌరవిస్తాను. వారి చెప్పినట్టుగానే అతిథిగా ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ కూడా ట్వీట్‌ చేశారు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ తెలుగు హీరోయిన్‌కు మళ్లీ కరోనా, వ్యాక్సిన్ వేసుకున్నా రెండో సారి కోవిడ్ వచ్చిందంటూ ట్వీట్ చేసిన అఖండ మూవీ హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్‌

ఇక మా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నాగబాబు మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. 'ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు' అంటూ ట్వీట్‌ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు.