Guntur Kaaram Pre Release Event Cancelled: మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో గుంటూరు కారం టీమ్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

పోలీసు వారి పర్మిషన్ లభించక ప్రీ రిలీజ్ (Guntur Kaaram Pre Release Event) ఈవెంట్ ని పోస్టుపోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Guntur Kaaram Poster(PIC@ Twitter)

Hyderabad, JAN 05: త్రివిక్రమ్, మహేష్ బాబు (Mahesh Babu)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).. మరో వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన ఈ మూవీ మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ చేసుకొని ఫ్యాన్స్ కి కూడా తెలియజేశారు. జనవరి 6 శనివారం నాడు ఈ ఈవెంట్ ని (Guntur Kaaram Pre Release Event) నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్లు అనౌన్స్ చేశారు. పోలీసు వారి పర్మిషన్ లభించక ప్రీ రిలీజ్ (Guntur Kaaram Pre Release Event) ఈవెంట్ ని పోస్టుపోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.  త్వరలోనే కొత్త డేట్‌ని, వేదికని అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించారు.

 

ఇక ఈ వార్తతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు (Mahesh babu) మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి.. ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నారు. గతంలో టీజర్, గ్లింప్స్, మోషన్ పోస్టర్, రీ రిలీజ్.. ఇలా చాలా ట్రెండ్స్ ని మహేషే స్టార్ట్ చేశారు.



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్