Mahesh Kind Nature: కృష్ణ మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ ఓ చిన్నారిని ఆదుకున్న మహేశ్ బాబు.. క్లిష్ట సమయంలోనూ వెంటనే స్పందించి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయించిన వైనం
తండ్రిని ఎంతగానో ప్రేమించే మహేశ్ బాబు ఆయన మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కృష్ణ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయలో మహేశ్ బాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, అంత బాధలోనూ మహేశ్ బాబు మానవతా దృక్పథాన్ని వీడలేదు.
Hyderabad, Nov 19: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) కొన్నిరోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. తండ్రిని ఎంతగానో ప్రేమించే మహేశ్ బాబు (Maheshbabu) ఆయన మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కృష్ణ ఆసుపత్రిలో (Hospital) మృత్యువుతో పోరాడుతున్న సమయలో మహేశ్ బాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, అంత బాధలోనూ మహేశ్ బాబు మానవతా దృక్పథాన్ని వీడలేదు. మోక్షిత్ అనే చిన్నారి గుండె జబ్బుతో (Heart Problem) బాధపడుతున్నాడని తెలుసుకున్న మహేశ్ బాబు... ఆ చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించారు. ఓవైపు తన తండ్రి మరణం అంచున నిలిచి ఉన్నప్పటికీ, చిన్నారి ప్రాణం కోసం మహేశ్ బాబు తపించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే, మరోవైపు ఆ చిన్నారి శస్త్రచికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కృష్ణ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసినా, చిన్నారి మోక్షిత్ కోసం మహేశ్ బాబు స్పందించిన తీరు అభిమానులను కదిలించివేసింది. కాగా, విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో మోక్షిత్ కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనట్టు తెలుస్తోంది.