Mahesh Babu Special Tweet: ఇది మీకోసమే నాన్న! మహేష్ బాబు స్పెషల్ ట్వీట్, సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఇవాళ ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇవ్వనున్న మహేష్

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా నుంచి తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. ఇక మహేష్ – త్రివిక్రమ్ టైటిల్, గ్లింప్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Mahesh Babu Special Tweet (PIC@ Twitter)

Hyderabad, May 31: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్ తో పాటు గ్లింప్స్ (Mahesh Babu New Movie) కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఇవాళ కృష్ణ పుట్టిన రోజు (Krishna Birth Anniversary) కావడంతో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ థియేటర్స్ లో నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.

ఇక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా నుంచి తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. ఇక మహేష్ – త్రివిక్రమ్ టైటిల్, గ్లింప్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement