Chiranjeevi At Balakrishna 50 Years Event: ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రెండు పిల్లర్లు ఒకే చోట అంటూ ఫ్యాన్స్ పండుగ (వీడియో ఇదుగోండి)
1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య (Balakrishna). 50 ఏళ్ళ తన నట ప్రస్థానం పూర్తవడంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని పిలిచి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తున్నారు.
Hyderabad, SEP 01: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరయ్యారు. చిరంజీవి బాలకృష్ణని హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ ఈవెంట్లో పక్కపక్కనే కూర్చుకున్నారు. ఇండస్ట్రీ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇలా కలిసి ఒకేచోట కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అయ్యప్ప మాలలో రావడం గమనార్హం.
వీడియో ఇదుగోండి
అలాగే చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కి వెంకటేష్ (Venkatesh), శ్రీకాంత్, నాని, కన్నడ స్టార్ హీరోలు శివన్న, ఉపేం, మన సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్ విచ్చేసారు.
ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.