Pawan Kalyan They Call Him OG Movie Update (PIC@ DVV Pictures X )

Hyderabad, SEP 01: సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) కావడంతో పవన్ ఫ్యాన్స్ రేపు ఫుల్ రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల పవన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ చేస్తున్నారు. మరో పక్క సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక అథియేటర్స్ లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ (GabbarSingh Re Release) చేసి సందడి చేస్తున్నారు. పవన్ పుట్టిన రోజుకు పవన్ చేతిలో ఉన్న సినిమాల నుంచి ఏదో ఒక స్పెషల్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తారని భావించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాజాగా OG సినిమా నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది.

Here's Tweet:

 

DVV ఎంటర్టైన్మెంట్స్ తమ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అదిరిపోయే పోస్టర్ (OG Poster) ఒకటి షేర్ చేసి.. కొన్ని గంటల్లో పవర్ ప్యాక్‌డ్ ఫైర్ సెలబ్రేషన్స్ మొదలవ్వనున్నాయి. OG కేవలం సినిమా మాత్రమే కాదు సెలబ్రేషన్ లాంటిది. పవన్ కళ్యాణ్ స్పెషల్ డేని (Pawan Kalyan Birthday Special) ఇంకా గొప్పగా చేయాలని ప్లాన్ చేసాము. కానీ ప్రస్తుతం వర్షాలు, వరదలు, ఉన్న పరిస్థితుల కారణంగా సెలబ్రేషన్స్ ని వాయిదా వేస్తున్నాము. కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచాము.

Janasena Leader on Allu Arjun: వీడియో ఇదిగో, నువ్వో పెద్ద కమెడియన్ అంటూ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన జనసేన నేతలు, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ.. 

రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తాము. రేపు స్పెషల్ డే ఎంజాయ్ చేసి సెలబ్రేషన్స్ వచ్చే రోజుల్లో కూడా చేసుకోండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ రేపు రాబోయే పవన్ పోస్టర్, ఆ తర్వాత సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.