Tollywood: మంచు ఫ్యామిలీకి నాగబాబు ట్విస్ట్, హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకి రూ. 50 వేలు సహాయం చేసిన నాగబాబు, దీంతో పాటు అపోలో ఆస్పత్రిలో మెడికల్ చెకప్
నా తల్లి బ్రెయిన్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌లో ఉందని, తనకు జీతం కూడా రాలేదని డబ్బులకు ఇబ్బందిగా ఉందని కూడా నాగశ్రీను వెల్లడించాడు. ఈ నేపథ్యంలో హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు సహాయం చేశాడు.
గత కొన్ని రోజుల ముందు విష్ణు మంచు దగ్గర పనిచేసే హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీను ఐదు లక్షల రూపాయల మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ వస్తువులను దొంగతనం చేశారని చెబుతూ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. అయితే విష్ణు మంచు పెట్టిన కేసు తప్పుడు కేసుగా చెబుతూ నాగ శ్రీను మీడియా ముందుకు వచ్చారు. తనను, తన తల్లిని, కులాన్ని మోహన్ బాబు దుషించారని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
మనసుకి కష్టంగా అనిపిచండంతోనే తాను వారి దగ్గర పని మానేశానని, అందుకు వారు తనపై తప్పుడు కేసు పెట్టారని నాగ శ్రీను ఆ వీడియోలో తెలియజేశాడు. నా తల్లి బ్రెయిన్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌లో ఉందని, తనకు జీతం కూడా రాలేదని డబ్బులకు ఇబ్బందిగా ఉందని కూడా నాగశ్రీను వెల్లడించాడు. ఈ నేపథ్యంలో హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు సహాయం చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు ఆర్థిక సహాయంగా 50వేల రూపాయల చెక్‌ను నాగశ్రీనుకు ఇచ్చాడు.
అంతేకాకుండా వారికి అపోలో ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా నాగబాబు సహాయం చేయడం చర్చనీయాంశంగా మారింది.