Bangalore, March 03: యష్ (Yash)హీరోగా వచ్చిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’(KGF) ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది. భారీ కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ తలరాత మారిపోయింది. అప్పటివరకు ఒక్క పాన్ ఇండియా(Pan India)సినిమా, ఒక్క 100 కోట్ల సినిమా కూడా కన్నడ పరిశ్రమకి(Kannada Movie Industry) లేదు. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినీ తలరాత పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది.

సినిమా రిలీజ్ అయి మూడేళ్లు పైనే అవుతున్నా సినిమాలో ఉండే ఎలివేషన్స్ గురించి ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు అంటే ఇది ఏ రేంజ్ లో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. కేజీఎఫ్’ (KGF) రిలీజ్ అయిన తర్వాత దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. దీంతో ‘కేజీఎఫ్ 2’ కోసం మూడు సంవత్సరాలుగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

ఇక ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్(youtube) లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు ని ఏ పాన్ ఇండియా సినిమా కూడా బద్దలు కొట్టలేకపోయింది అంటే జనాలు ‘కేజీఎఫ్ 2’ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది.

Radhe Shyam Trailer: రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల, హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో ప్రభాస్

తాజాగా ‘కేజీఎఫ్ 2’ నుంచి మరో క్రేజీ అప్డేట్ (KGF 2 Update) వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కేజీఎఫ్ 2’ సినిమా ట్రైలర్ ని మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ ట్రైలర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ‘కేజీఎఫ్ 2’ ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.