Nag breaks into tears: అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున.. ఎందుకు?

శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదన్న నాగ్

Hyderabad, September 9: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల కోసం ఈ సినిమా ప్రీమియర్ ఏర్పాటు చేశారు.

యాంకర్ లాస్యకు ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై సీరియస్ గా కనిపించిన లాస్య, ఆందోళనలో అభిమానులు..

నాగార్జున, అమల, శర్వానంద్, అక్కినేని అఖిల్ తదితరులు సినిమాను వీక్షించారు. సినిమా చూసి థియేటర్ లోనే నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు తనకు కన్నీళ్లు ఆగలేదని నాగ్ అన్నారు. మా అమ్మ, ఆమె చూపించిన ప్రేమ గుర్తుకొచ్చాయని చెప్పారు. చాలా భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif