Nagarjuna to send legal notices to Konda Surekha(X)

Hyderabad, NOV 28: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌కు (Konda Surekha) నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) వేసిన ప‌రువున‌ష్టం కేసులో మంత్రి సురేఖ‌కు కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసు విచార‌ణ‌ను నాంప‌ల్లి కోర్టు Nampally Court( డిసెంబ‌ర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబ‌ర్ 12న జ‌రిగే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని మంత్రి సురేఖ‌ను కోర్టు ఆదేశించింది. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర‌ న‌టి స‌మంత‌తో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండ‌స్ట్రీలో దూమారం రేపాయి.

Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన  

అయితే కొండా చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. త‌న కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.