Aditya 369 Movie: ఆ విషయంలో సిల్మ్ స్మితను కొట్టేవారే లేరు, అలనాటి శృంగార తారను పొగడ్తలతో ముంచెత్తిన హీరో బాలకృష్ణ, ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకున్న బాలయ్య
సిల్క్ స్మితకు తెలుగు రాదు. దాంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్‌ను ఇంగ్లీష్‌లో చెప్పింది. చెప్పడమే కాకుండా షాట్ అయిపోయిన తర్వాత ఓకే కదా డైరెక్టర్ గారూ అని అడిగింది. దాంతో అక్కడే ఉన్న సింగీతం.. నువ్వు డైలాగ్ చెప్పింది ఇంగ్లీషులో అమ్మ.. మనది తెలుగు సినిమా అనేశాడు.
సిల్మ్ స్మిత..ఈ పేరును సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా స్టార్ డం తెచ్చుకున్న సిల్మ్ స్మిత (Late heroine silk smitha) రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. గ్లామర్ పాత్రలతో అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం 16 ఏళ్ల కెరీర్‌లోనే ఏకంగా 450 సినిమాలకు పైగా నటించిన సిల్క్ స్మిత.. 36 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. అప్పటివరకు కేవలం గ్లామరస్ డాల్‌గానే గుర్తింపు పొందిన ఆమె ఆదిత్య 369 (Aditya 369 Movie) సినిమాలో కీలకపాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు.
అందులో సిల్క్ స్మిత రాజనర్తకి పాత్రలో నటించింది. తమ కాలానికి వచ్చిన బాలకృష్ణపై (nandamuri balakrishna) మోజుపడి కృష్ణ దేవరాయల దగ్గర దోషిగా నిలిచిపోయే పాత్ర ఇది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ మధ్య 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆదిత్య 369 విశేషాలను బాలకృష్ణ మీడియాకు తెలిపారు. సినిమా విజయంలో సిల్క్‌స్మిత పాత్ర కూడా కీలకమైందని చెప్పాడు బాలయ్య. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన గురించి పంచుకున్నాడు.
సిల్క్ స్మితకు తెలుగు రాదు. దాంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్‌ను ఇంగ్లీష్‌లో చెప్పింది. చెప్పడమే కాకుండా షాట్ అయిపోయిన తర్వాత ఓకే కదా డైరెక్టర్ గారూ అని అడిగింది. దాంతో అక్కడే ఉన్న సింగీతం.. నువ్వు డైలాగ్ చెప్పింది ఇంగ్లీషులో అమ్మ.. మనది తెలుగు సినిమా అనేశాడు. దాంతో సెట్ లో ఉన్న వాళ్ళందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వేశారు. అంటూ నాటి సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు బాలకృష్ణ. అయితే జోక్స్ ఎలా ఉన్నా స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం సిల్క్ స్మితని కొట్టే ఆడది మరొకరు లేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. సాక్షాత్తు శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా సిల్క్ స్మితను ఫాలో అయ్యారని.. అది ఆమె రేంజ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను కొట్టిన హీరోయిన్ లేనే లేదు. ఎందుకంటే శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లు సైతం సిల్మ్ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్‌ని ఇమిటేట్ చేసేది. ఒక డ్యాన్సర్‌ని స్టార్ హీరోయిన్లు సైతం ఫాలో కావడం అంటే అది మామూలు విషయం కాదు' అంటూ బాలకృష్ణ సిల్క్ స్మితపై ప్రశంసలు కురిపించారు.
అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చివరికి ఏమీ లేకుండా చనిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కటిక పేదరికం అనుభవిస్తూ.. అప్పుల ఊబిలో చిక్కుకొని.. దిక్కుతోచని స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)