Dasara Movie Deleted Scene: ఇంతమంచి సీన్ ఎందుకు తీసేశారు! దసరా మూవీ డిలీటెడ్ సీన్‌పై ఫ్యాన్స్ ఆశ్చర్యం, మీరూ ఓ లుక్కేయండి!

నాని, కీర్తిని పెళ్లి చేసుకున్న తరువాత వచ్చే సన్నివేశం ఇది. కీర్తి తన పుట్టింటికి వచ్చి తన తల్లి మాట్లాడడం. ఆ తరువాత తన అత్త వచ్చి కీర్తిని, నాని ఇంటి దగ్గరకు తీసుకు వెళ్లి ఇదే నీ ఇల్లు లోపలికి వేళ్ళు అని బతిమాలడం, ఈ సీన్ మొత్తం నాని గోడ పక్కన ఉంది వినడం.. ఎమోషనల్ గా ఉంది.

Dasara Movie Deleted Scene (PIC @ Youtube)

Hyderabad, April 10: నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా (Dasara). మార్చి 30న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి చనిపోయిన తరువాత నాని, కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీలోని డిలీట్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. నాని, కీర్తిని పెళ్లి చేసుకున్న తరువాత వచ్చే సన్నివేశం ఇది. కీర్తి తన పుట్టింటికి వచ్చి తన తల్లి మాట్లాడడం. ఆ తరువాత తన అత్త వచ్చి కీర్తిని, నాని ఇంటి దగ్గరకు తీసుకు వెళ్లి ఇదే నీ ఇల్లు లోపలికి వేళ్ళు అని బతిమాలడం, ఈ సీన్ మొత్తం నాని గోడ పక్కన ఉంది వినడం.. ఎమోషనల్ గా ఉంది.

ఇక ఈ సీన్ చూసిన ఆడియన్స్.. ఇంత మంచి సీన్ ని ఎందుకు తీసేశారు అంటూ అభిప్రాయ పడుతున్నారు. కాగా ఈ మూవీలోని మరికొన్ని డిలీట్ సీన్స్ కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 6 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ అందుకొని అదరగొట్టేసింది. నాని కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Felicitation for Oscar Winners: నేను,చంద్రబోస్‌ ఉత్సవ విగ్రహాలం మాత్రమే:ఎంఎం కీరవాణి, ఆస్కార్ విజేతలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్మానం, తరలివచ్చిన టాలీవుడ్ 

ప్రస్తుతం థియేటర్ల వద్ద ఇంకా దసరా హవా కొనసాగుతూనే ఉంది. మరి మునుముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత నాని తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif