Hyderabad, April 10: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో ‘నాటు నాటు’ (Naatu Naatu song) సాంగ్ ఇండియన్ సినిమా చరిత్రలో నెవర్ బిఫోర్ ఫీట్‌ను అందుకుంది. ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుని యావత్ ప్రపంచానికి టాలీవుడ్ సత్తాను చాటింది ఈ పాట. ఇక ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (MM Keeravani), పాట రచయిత చంద్రబోస్‌లు (Chandrabose) ఆస్కార్ అవార్డును అందుకున్నారు. వారి ప్రతిభకు యావత్ భారతదేశ సినీ ప్రేమికులు సెల్యూట్ చేశారు. కాగా తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ ఈ ఆస్కార్ విన్నర్స్‌ను (Oscar Winners) ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్‌లకి ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు, రాజకీయ నేతలు హాజరయ్యారు.
Attended the felicitation program organised by Telugu Film Industry at Shilpakalavedika for #RRR Movie Team members on winning the Oscar award for #NaatuNaatu song.
Accompanied by Colleague Minister Srinivas Goud Garu felicitated Music Sensation M. M. Keeravani Garu & renowned… pic.twitter.com/UuKb4tDYuG
— Talasani Srinivas Yadav (@YadavTalasani) April 9, 2023
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం వెనుక మూల విగ్రహాలు రాజమౌళి (Rajamouli) అండ్ ప్రేమ్ రక్షిత్.. నేను, చంద్రబోస్‌లు కేవలం ఉత్సవ విగ్రహాలం మాత్రమే.. తెలుగు సినీ పరిశ్రమ నేడు ఒక్కచోట చేరి ఇలా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది.. నా తొలి పాటను చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో రికార్డు చేశాను.. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ అది.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా నాకు కృష్ణంరాజు సూర్యనారాయణ రాజు అవకాశం ఇచ్చారు.. ఆస్కార్ వల్ల నేను ఎక్సయిటింగ్ అవ్వలేదు.. ఈ పాటకు అందరూ ఎంతో కష్టపడ్డారు.. ఈ సినిమా కోసం ఆస్కార్ మెంబర్స్‌కి షోస్ వేసి చూపించాం.. వాళ్లకు నచ్చింది.. అందరూ సమిష్టిగా చేసిన కృషికి లభించిన విజయానికి మీరందరూ వేడుక చేయడం సంతోషంగా ఉంది..’’ అని కీరవాణి ఎమోషనల్ అయ్యారు.
గేయరచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘సినీ ఇండస్ట్రీ అంతా మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది.. నా మిత్రుడి మాట, కీరవాణి గారి మాట.. ఈ రెండు మాటలు నా జీవిత గమనం మార్చాయి.. ఆస్కార్ ఎనౌన్స్ చేసేటప్పుడు నేను భయంతో కీరవాణి గారి చెయ్యి పట్టుకున్నాను.. ఆస్కార్ పట్టుకున్న వెంటనే భారతీయ కీర్తి పతాకాన్ని పట్టుకున్నాను అనే భావన కలిగింది.. ఆస్కార్ అందుకోవడం నా జన్మలో చేసుకున్న అదృష్టం.. కీరవాణి గారితో నాది 28ఏళ్ల అనుబంధం.. బాహుబలిలో నాకు అవకాశం రాకున్నా, ఆర్ఆర్ఆర్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకొని సహనంతో ఉన్నాను.. ఈ పాటకు 17 నెలల సమయం పట్టింది..’’ అని పేర్కొన్నారు.