Nayanthara, Vignesh Shivan: వయనాడ్ విషాదం.. న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల దాతృత్వం.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా రూ. 20 ల‌క్ష‌లు అంద‌జేత‌

ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Nayanthara, Vignesh Shivan

Wayanad, Aug 3: కేరళలో (Kerala) వయనాడ్‌ (Wayanad) జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివన్ తమ వంతు సాయంగా రూ.20 లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. కాగా, నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు ఓమన కురియన్, కురియన్ కొడియాట్టు కేరళలోని తిరువల్లలో నివాసం ఉంటున్నారు.

తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్

వీళ్లు కూడా..

ఒక్క నయనతార దంపతులే కాదు.. వయనాడ్ బాధితుల కోసం సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్‌ కు విరాళాలు అందించిన విషయం తెలిసిందే.

మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు