Hyd, January 16: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల 11న ఇద్దరిని హత్య చేసిన నిందితుడు... హత్య అనంతరం మధ్యప్రదేశ్ కు పారిపోయాడు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేందుకు కొండపైకి వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాలను గుర్తించి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగిలో జంట హత్యల కేసు, అత్యంత దారుణంగా రేప్ చేసి బండరాయితో చంపేశారని అనుమానాలు, ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందడంతో ఆమెను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానించారు. మృతదేహాలను పరిశీలించి.. ఇద్దరూ దారుణహత్యకు గురైనట్టు గుర్తించారు. కత్తులతో పొడిచి అనంతరం బండ రాళ్లతో తలపై మోది హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.