Nikhil Siddhartha: సోష‌ల్ మీడియాలో హీరో నిఖిల్ చేసిన పోస్టుకు అనూహ్య స్పంద‌న‌, కంగ్రాట్స్ చెప్తూ ఫ్యాన్స్ రిప్లై

2020లో పల్లవి(Pallavi) అనే అమ్మాయిని నిఖిల్ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం నిఖిల్ భార్య ఓ ఈవెంట్లో కనిపించినప్పుడు బేబీ బంప్ తో కనపడటంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న నిఖిల్ భార్య పల్లవి సీమంతం(Baby Shower) జరగ్గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Nikhil Siddhartha (PIC@ Instagram)

Hyderabad, FEB 01: వరుస సినిమాలతో మెప్పిస్తున్న నిఖిల్ (Nikhil) ఇటీవల కార్తికేయ 2 (Karthikeya-2) సినిమాతో 100 కోట్ల పాన్ ఇండియా భారీ హిట్ కొట్టి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత స్పై అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ఇప్పుడు మరో మూడు పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టాడు నిఖిల్. ‘స్వయంభు’(Swawyambhuyambhu), ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాలు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం స్వయంభు సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు నిఖిల్. తాజాగా తన భార్యకు సీమంతం (Baby Shower) జరిగినట్టు తెలిపాడు. 2020లో పల్లవి(Pallavi) అనే అమ్మాయిని నిఖిల్ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం నిఖిల్ భార్య ఓ ఈవెంట్లో కనిపించినప్పుడు బేబీ బంప్ తో కనపడటంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న నిఖిల్ భార్య పల్లవి సీమంతం(Baby Shower) జరగ్గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

సీమంతం వేడుకల్లో తన భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. సీమంతం.. ట్రెడిషినల్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ బేబీ షవర్. మా ఫస్ట్ బేబీ త్వరలో రానుంది అని చెప్పడానికి పల్లవి, నేను చాలా హ్యాపీగా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని పోస్ట్ చేసాడు నిఖిల్. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు, ప్రముఖులు నిఖిల్ కి కంగ్రాట్స్ చెప్తుండగా నిఖిల్ భార్య సీమంతం ఫొటో వైరల్ గా మారింది.