CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.
Hyd, December 26: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో, థియేటర్ యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరించారని తెలిపారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు వెల్లడించారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని...సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు.
అలాగే సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని ..శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు ఇవే..
ఈ సమావేశంలో నిర్మాతలు సురేశ్ బాబు, కేఎల్ నారాయణ,దామోదర్, అల్లు అరవింద్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్,చినబాబు, డీవీవీ దానయ్య,, ఇకరణ్, రవి,నాగబాబు,టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న,యువీ వంశీ, సుధాకర్ రెడ్డి,సునీల్,గోపి, సీ కళ్యాణ్, రమేష్ ప్రసాద్,భరత్ భూషణ్ పాల్గొన్నారు.
no benefit shows in Telangana again clarifies CM Revanth Reddy
అలాగే దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, కే రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వంశీ పైడిపల్లి,హరీశ్ శంకర్, వీర శంకర్, త్రివిక్రమ్, బాబి,వేణు శ్రీరామ్, వేణు, విజయేంద్రప్రసాద్‌లతో పాటు నటులు నాగార్జున,వరుణ్ తేజ్,సాయిదుర్గ తేజ్, కళ్యాణ్ రామ్,శివ బాలాజీ, అడివి శేష్, నితిన్, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ, రామ్ పోతినేని తదితరులు పాల్గొన్నారు.