Paresh Rawal Covid Positive: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా..బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు కరోనా, నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలని ట్వీట్, దేశంలో తాజాగా 62,258 మందికి కరోనా నిర్ధారణ
అయితే, ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకడం గమనార్హం. తనకు కరోనా వచ్చిందని శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ నాకు కరోనా (Paresh Rawal Tests Positive for COVID-19) సోకింది. గత పది రోజుల్లో నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.
New Delhi, March 27: బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పరేశ్ రావల్ కు కరోనా (Paresh Rawal Covid Positive) సోకింది. అయితే, ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకడం గమనార్హం. తనకు కరోనా వచ్చిందని శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ నాకు కరోనా (Paresh Rawal Tests Positive for COVID-19) సోకింది. గత పది రోజుల్లో నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.
వాస్తవానికి మార్చి 9నే ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు. ‘వీ అంటే వ్యాక్సిన్స్! కరోనా సంక్షోభ సమయంలో పనిచేసిన డాక్టర్లు, నర్సులు, ముందు వరుస యోధులైన ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులకు ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు. టీకా తీసుకుని మూడు వారాలు కాకముందే ఆయనకు కరోనా సోకింది.
నటి మరియు లైఫ్ స్కిల్స్ టీచర్ అయిన పరేష్ రావల్ భార్య స్వరూప్ రావల్ కూడా ఈ నెల మొదట్లో టీకా అందుకున్నారు. మార్చి 6 న ఒక ట్వీట్‌లో ఆమె ఇలా రాసింది: "నాయకుడిని అనుసరించండి ... నేను COVID-19 వ్యాక్సిన్ వేయించుకున్నాను మరి మీరు అంటూ ట్వీట్ చేసింది.
Here's Updates
Here's Paresh Rawal Wife Swaroop Rawal Tweet
దేశంలో గత 24 గంటల్లో 62,258 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 30,386 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,08,910కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,240 కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,95,023 మంది కోలుకున్నారు. 4,52,647 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,81,09,773 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,97,69,553 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,64,915 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.