Pathaan Song Row: బేషరం రంగ్ పాట చాలా ప్రమాదం, దానివల్ల యువత చెడు దారి పడతారు, వెంటనే సోషల్ మీడియాల నుండి తొలగించాలని యూపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన సిడబ్ల్యుసి
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) 'పఠాన్' సినిమా పాట (Pathaan Song Row) 'బేషరం రంగ్' క్లిప్పింగ్‌లు, ఇతర అసభ్యకరమైన విషయాలను సోషల్ మీడియా నుండి తొలగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి సూచించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) 'పఠాన్' సినిమా పాట (Pathaan Song Row) 'బేషరం రంగ్' క్లిప్పింగ్‌లు, ఇతర అసభ్యకరమైన విషయాలను సోషల్ మీడియా నుండి తొలగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి సూచించింది. కౌమారదశలో ఉన్నవారి మానసిక స్థితిపై ఈ పాట (Besharam Rang) హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015లోని సంబంధిత సెక్షన్ కింద ఇచ్చిన అధికారాలను ఉపయోగించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బహ్రైచ్ (మేజిస్ట్రేట్ బెంచ్), అశ్లీల విషయాలపై సుమోటోగా తీసుకున్నట్లు DGPకి లేఖ రాసింది.
డీజీపీకి పంపిన లేఖలో బహ్రైచ్ సీడబ్ల్యూసీ అధ్యక్షుడు సతీష్ కుమార్ శ్రీవాస్తవ, దీప్మాల ప్రధాన్, అర్చన పాండే, నవనీత్ మిశ్రాలతో కూడిన నలుగురు సభ్యుల ధర్మాసనం.. టీనేజర్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందజేసిందని పేర్కొంది. అందువల్ల వారు సులభంగా అందుబాటులో ఉండే కంటెంట్‌లను చూడకుండా ఆపలేరు. అటువంటి పరిస్థితిలో, సోషల్ మీడియా నుండి అసభ్యకరమైన ఇలాంటి విషయాలను తొలగించడం వారి ప్రయోజనాల దృష్ట్యా అవసరమని లేఖలో పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, సెక్సీ భామ దీపికా పదుకునే నటించిన పఠాన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అయింది. ఇది విడుదల కాగానే వివాదాస్పదంగా మారింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
బేషరమ్ రంగ్ అంటూ సాగే రొమాంటిక్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. షారుఖ్, దీపిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి చాలా కాలమైంది. అయితే బేషరమ్ సాంగ్‌లో మునుపటి మ్యాజిక్ రిపీట్ చేసినట్లు పాటను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్‌గా రిలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. దీపిక తన బికినీ అందాలతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది.
మరోవైపు షారుఖ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు.యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.