IPL Auction 2025 Live

Pawan Kalyan BRO Movie Review: బ్రో సినిమా రివ్యూ ఇదిగో, ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు.

BRO Movie

మెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

ఈ సోషియో ఫాంటసి సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఇవాళ అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్‌ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్‌ మీడియా వేదికగా చర్చిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేత, గూడురులో K3K సంగం థియేటర్ యాజమాన్యానికి, పవన్ అభిమానులకు మధ్య గొడవ

ఇప్పటికే ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్‌గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్‌ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్‌ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Here's Tweets

బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్‌ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్‌ బాగా వర్కౌట్‌ అయింది. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. పవన్‌ కల్యాణ్‌ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్‌ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



సంబంధిత వార్తలు

NTR Movie With Nelson: సెన్సేష‌న‌ల్ డైరక్ట‌ర్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ! పాన్ ఇండియాలో లెవ‌ల్ లో ఎన్టీఆర్ ప్లాన్

Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్

‘Pushpa 2 – The Rule’ Update: పాట్నాలో పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ విడుదల, అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్