Pawan Kalyan Balakrishna Meet: టాక్ షో కంటే ముందే బాలకృష్ణ- పవన్ కల్యాణ్ మీటింగ్, 20 నిమిషాల పాటూ ఏకాంతంగా చర్చలు, ఈ నెల 27న అన్ స్టాపబుల్ షో షూటింగ్

ఇవాళ జస్ట్ వీరిద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నందుకే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటే...ఇక అన్ స్టాపబుల్ షో (Unstopble show) టెలికాస్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

Pawan Kalyan to shoot for Nandamuri Balakrishna's talk show

Hyderabad, DEC 23: ఇండస్ట్రీని షేక్ చేసే కాంబినేషన్ తెరమీదకు వచ్చింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్(Pawan kalyan), సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అన్ స్టాపబుల్  టాక్ షోతో ప్రజలకు మరింత చేరువ అవుతున్న నటుడు బాలకృష్ణ త్వరలోనే డెడ్లీ కాంబినేషన్ తో రానున్నారు. పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ -2 షో షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న బాలకృష్ణ, పవన్ కల్యాణ్ షో షూటింగ్ కానుంది. అయితే అంతకంటే ముందుగానే వీరిద్దరూ ఓ షూటింగ్ స్పాట్‌ లో కలిశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరి సినిమాల షూటింగ్స్‌ జరిగాయి. హరిహర వీరమల్లు, వీర సింహారెడ్డి (Veerasimha reddy) సినిమాల షూటింగ్‌ గ్యాప్‌లో ఇద్దరు స్టార్స్‌ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

Oscars 2023 Shortlists RRR Song: అస్కార్ బరిలో RRR మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకున్న నాటు నాటు సాంగ్, విశ్వవ్యాప్తమైన తెలుగు సినిమా ఖ్యాతి 

దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఏకాంత భేటీలో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇవాళ జస్ట్ వీరిద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నందుకే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటే...ఇక అన్ స్టాపబుల్ షో (Unstopble show) టెలికాస్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.