Kalki Trailer Release Date: క‌ల్కీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!ఆ రోజే రిలీజ్ చేస్తామ‌ని మూవీ టీమ్ ప్ర‌క‌ట‌న‌, ఇక‌పై ప్ర‌మోష‌న్స్ వేగం కూడా పెంచ‌నున్న యూనిట్

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్.. తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Kalki 2898 AD (photo-Twitter)

Hyderabad, June 05: ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్.. తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బాగేట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కల్కి (Kalki 2898ad Movie) సినిమాలో అమితాబ్, కాల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. లతో పాటు మరింతమంది స్టార్ నటీనటులు ఉన్నారని సమాచారం. అయితే కల్కి సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల ఎన్నికల ముందు కూడా రిలీజ్ చేస్తామని ఓ డేట్ కూడా ఇచ్చారు. కానీ ఎన్నికల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇటీవల కల్కి సినిమాని ఎన్నికలు అయిపోయి, ప్రభుత్వం ఏర్పడ్డాక జూన్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక కల్కి ప్రమోషన్స్ బుజ్జి వెహికల్ తో చేస్తున్నప్పటికీ సినిమా నుంచి అప్డేట్స్ అడుగుతున్నారు అభిమానులు. గత కొన్ని రోజులుగా కల్కి సినిమా ట్రైలర్ (Kalki 2898ad Movie Trailer Release) విడుదల చేస్తారు అని ప్రచారం సాగుతుంది.

 

ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది. కల్కి నిర్మాత అశ్వినీదత్ గతంలో అనేకసార్లు కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇపుడు కూటమి గెలవడంతో తాజాగా కల్కి సినిమా ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసారు. కల్కి సినిమా ట్రైలర్ జూన్ 10న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. మరి దీనికి భారీ ఈవెంట్ చేస్తారా లేదా డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా చూడాలి. ఇక ట్రైలర్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. ఈ కల్కి ట్రైలర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif