Salaar Movie Promotions: సలార్ ప్రమోషన్స్ లేనట్లే! కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టని ప్రభాస్, ప్రమోషన్స్ భారం భుజాన ఎత్తుకున్న జక్కన్న
కానీ సలార్ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యట్లేదు చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. అసలు సలార్ బ్యానర్స్, హోర్డింగ్స్ కూడా బయట సరిగ్గా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Mumbai, DEC 15: ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. పలు మార్లు వాయిదా పడి మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కానీ సలార్ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యట్లేదు చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. అసలు సలార్ బ్యానర్స్, హోర్డింగ్స్ కూడా బయట సరిగ్గా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సలార్ ప్రమోషన్స్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే సలార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. తాజాగా సలార్ ప్రమోషన్స్ గురించి ఓ సమాచారం బయటకి వచ్చింది. ఆల్రెడీ రాజమౌళి (Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారని, ఆ ఇంటర్వ్యూ మరో రెండు మూడు రోజుల్లో బయటకి వస్తుందని తెలుస్తుంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు మీడియాతో ఆదివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని తెలుస్తుంది.
ఈ రెండు తప్ప ఇంకా సలార్ కి ఎలాంటి ప్రమోషన్స్ చేయరని సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ కి బయటకి రాడా? అభిమానులకు కనపడడా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు షారుఖ్ డంకీ సినిమా డిసెంబర్ 21న సలార్ కి ఒక రోజు ముందు పోటీగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి షారుఖ్ కూడా ఎక్కువగా ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. మరి సలార్ సినిమా ప్రమోషన్స్ లేకుండా ఉన్న అంచనాలను అందుకుంటుందా చూడాలి. ఏ రేంజ్ లో సలార్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి.