Ashwini Dutt: ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఏమిటా సినిమా?
2011 సంవత్సరంలో ఎన్టీఆర్‌తో చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Hydrabad, May 5: 2011 సంవత్సరంలో ఎన్టీఆర్‌తో (Jr. NTR) చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి (Shakti) వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ (Ashwini Dutt) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఎదురు దెబ్బలు తగలడం సహజమేనని, ఐతే వాటిని ఎదుర్కొని ముందుకు అడుగులేస్తుంటామని ఆయన అన్నారు. ఐతే తన కెరీర్‌లో ఆ ఒక్క వల్ల కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. శక్తి మువీని 40 – 45 కోట్ల బడ్జెట్‌తో (Budget) రూపొందించారు. అప్పట్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న భారీ ప్రాజెక్ట్ అది. శక్తి వల్ల రూ.32 కోట్ల నష్టం రావడంతో లు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నానని ఆయన తెలిపారు.
కొత్త చిత్రం ఏంటంటే??
అశ్వినీదత్ ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకొణె నటీనటులుగా 'ప్రాజెక్ట్-కె' (వర్కింగ్ టైటిల్) మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.