Jr. NTR On TV Screen Again: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ సిద్ధం.. వివరాలు ఇవే!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. వెండితెరపైనే గాక, బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకున్నారు. తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట.
Hyderabad, May 5: టాలీవుడ్ స్టార్ (Tollywood) హీరో ఎన్టీఆర్ (Jr. NTR).. వెండితెరపైనే (Silver Screen) గాక, బుల్లితెర (Small Screen) మీద కూడా తన సత్తా చాటుకున్నారు. తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఈ రియాల్టీ షో గురించి ఇప్పటివరకు ఎలాంటి డీటైల్స్ బయటకు రాలేదు. కానీ ఈ షోకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. గతంలో తారక్.. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడిగా కూడా ఆయన అలరించారు.
మూవీలు ఏంటంటే?
ప్రస్తుతం ఆయన డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూరు కానుంది. ఎన్టీఆర్ 30 తర్వాత తారక్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది.
(The above story first appeared on LatestLY on May 05, 2023 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

