Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్
ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.
Hyderabad, July 18: గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ (Director Nagashwin) తో చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే' (Project-K) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో దీపిక ఎంతో సీరియస్ గా కనిపిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని అంటున్నారు.
అంతర్జాతీయ వేదికపై గ్రాండ్ గా
ప్రభాస్ స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకొని 'ప్రాజెక్ట్ కే' సినిమా టైటిల్ ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. రేపటి నుంచి యూఎస్ లోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి. అక్కడే ఈ నెల 20 సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
హాజరుకానున్న అతిరథులు
'ప్రాజెక్ట్ కే' సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ పాల్గొననున్నారు. మరోవైపు 'ప్రాజెక్ట్ కే'లో 'కే' అంటే కాలచక్రం అనే ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయొచ్చని కూడా సమాచారం.