Atishi, LG V K Saxena (Credits: X)

Newdelhi, Feb 10: యమునా నది (Yamuna) శాపమే ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (Aap) ఘోర పరాజయానికి కారణమా? గవర్నర్ వీకే సక్సేనా (LG V K Saxena) తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ (Atishi) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో అతిశీతో సక్సేనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణం యమునా నది శాపమేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేజ్రీవాల్ ను కూడా హెచ్చరించానని, అయితే, ఆయన పట్టించుకోలేదని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలకు అతిశీ స్పందించలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

అసలు ఏం జరిగిందంటే..

ఢిల్లీ ప్రజలకు తాగునీరందించే యమునా నదిలో కాలుష్యం స్థాయులు తీవ్రంగా పెరిగిపోయాయని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపి, నదిని పునరుద్ధరించే చర్యలను సిఫారసు చేసేందుకు గవర్నర్ నేతృత్వంలో ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, కమిటీలో నిపుణులులేరన్న కారణంతో ఎన్జీటీ ఆదేశాలను ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో యమున ప్రక్షాళన అటకెక్కింది. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ఎల్జీ వీకే సక్సేనాకు, ఆప్ ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. ఆప్ సర్కారుకు యమునా నది శాపం తగులుతుందని ఎల్జీ పదే పదే హెచ్చరించారు.

అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు