Gango Renuka Thalli Audio Song: పుష్ప-2 గంగమ్మ జాతర సాంగ్ వచ్చేసింది, థియేటర్ లో ఈ పాటకు గూస్ బంప్స్ ఖాయం
ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ బన్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. మహాలింగం పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Hyderabad, DEC 06: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule). పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఇక తెలుగు ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
Pushpa 2 Gango Renuka Thalli Audio Song Out
ఇదిలావుంటే ఈ మూవీ నుంచి తాజాగా ‘గంగో రేణుక తల్లి’ (Gango Renuka Thalli) జాతర ఆడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ బన్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. మహాలింగం పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.