#LionInLamborghini: లంబోర్గిని కారులో రజనీకాంత్, ఖుషీ అవుతున్న ఫ్యాన్స్, కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్

ఈ ఫోటోలో రజనీకాంత్ (Rajinikanth) ముఖానికి మాస్క్‌ ధరించి కారును డ్రైవ్‌ చేస్తున్నారు. కాగా ఆయన డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రపంచంలో అత్యంత వేగంవంతమైన కార్లలో ఒకటి. సాధారణమైన తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్‌లో లంబోర్గిని కారును నడుపుతున్నట్లు సూపర్‌ స్టార్‌ కనిపిస్తున్నారు.

Rajinikanth (Photo Credits: Twitter)

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ లంబోర్గిని కారును (Lamborghini Car) స్వయంగా నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఓ ఫొటో సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రజనీకాంత్ (Rajinikanth) ముఖానికి మాస్క్‌ ధరించి కారును డ్రైవ్‌ చేస్తున్నారు. కాగా ఆయన డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రపంచంలో అత్యంత వేగంవంతమైన కార్లలో ఒకటి. సాధారణమైన తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్‌లో లంబోర్గిని కారును నడుపుతున్నట్లు సూపర్‌ స్టార్‌ కనిపిస్తున్నారు. అవి క్రూర‌మైన హ‌త్య‌లు, తూత్తుకుడి తండ్రీకొడుకులు చనిపోయిన ఘటనపై స్పందించిన రజినీకాంత్, వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రభుత్వాన్ని కోరిన తలైవార్

ఇక అత్యంత ఖరీదైన ఈ కారును కరోనా వైరస్‌ సంక్షోభం ముందు కొనుగోలు చేశారా? ఇటీవల కొనుగోలు చేశారా? అనే దానిపై స్పష్టత లేదు. ఓ తమిళ నిర్మాత తనను ఇంటికి తిరిగి వెళ్లడం విషయంలో తీవ్రంగా అవమానించిన విషయాన్ని ‘దర్బార్‌’ ఆడియో వేడుకలో (Darbar Audio Release) రజనీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తనను కారు కొనేలా ప్రేరేపించిందని తెలిపారు.

Age Is Just A Number 

ప్రస్తుతం రజనీ వద్ద ప్రీమియర్‌ పద్మిని, అంబాసిడర్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ జి క్లాస్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ వంటి సూపర్‌ కార్లు ఉన్నాయి. బాలీవుడ్‌లో లంబోర్గిని సూపర్‌ కారును రోహిత్‌ శెట్టి, రన్‌వీర్‌ సింగ్‌ కలిగి ఉన్నారు. కరోనా వైరస్‌ కారణంగా రజనీకాంత్‌ ఇంటికే పరితమైయ్యారు.

సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ సినిమా ఆరంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ (Annaatthe) అని టైటిల్‌ పెట్టినట్లు ప్రకటించారు. అంటే.. ‘అన్నయ్య’ అని అర్థం. అయితే లాక్‌డౌన్‌ ముందు వరకూ జరిపిన షెడ్యూల్స్‌లో 50 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తయింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Allu Arjun Arrested: అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇవే, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు, బెయిల్ మంజూరు చేసే అవకాశాలకు సంక్లిష్టం

Kurla Bus Accident: ఇంత‌కంటే నీచం ఉంటుందా? శ‌వాన్ని కూడా వ‌ద‌ల‌ని దుర్మార్గుడు, ముంబైలో జ‌రిగిన ఘ‌ట‌న చూసి విస్తుపోతున్న నెటిజ‌న్లు

Manchu Family Dispute: మోహన్‌ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ