Rajinikanth says miracle and wonder will happen in 2021,CM Palaniswami says actor might have meant AIADMK’s return to power (Photo-ANI)

Chennai, July 1: త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు (Tuticorin father-son) పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌నపై సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను ర‌జ‌నీకాంత్ ‘క్రూర‌మైన హ‌త్య‌లు’గా (brutal killing) ప‌రిగ‌ణించారు. నిబంధ‌న‌లకు విరుద్ధంగా కొంత‌మంది పోలీసులు పైశాచికంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ర‌జ‌నీకాంత్ మండిప‌డ్డారు. ఇలాంటి త‌ప్పు చేసిన‌వారిని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని ఆయన డిమాండ్ చేశారు.

తండ్రీకొడుకుల‌ను వేధించి కిరాతంగా హ‌త్య చేయ‌డాన్ని (Tuticorin custodial deaths) మాన‌వ స‌మాజ‌మంతా వ్య‌తిరేకిస్తుంది. కొంత‌మంది పోలీసుల ప్ర‌వ‌ర్త‌న నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఎవ‌రెవ‌రైతే ఈ హ‌త్యాఘ‌ట‌న‌ల్లో ఉన్నారో..వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని, వారిని వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

కాగా తూత్తుకుడికి చెందిన మొబైల్ షాపు ఓన‌ర్లు అయిన పీ జ‌య‌రాజ్‌, జే బెనిక్స్‌ల‌ను ఇటీవ‌ల స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న ఉల్లంఘించి షాపు తెరిచార‌ని వారిని అరెస్టు చేశారు. అయితే లాక‌ప్‌లో ఉన్న వారు. రెండు రోజుల వ్య‌వ‌ధి తేడాలో మృతిచెందారు. తండ్రీకొడుకులు పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌న ప‌ట్ల మంగ‌ళ‌వారం మ‌‌ద్రాస్ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ స్వీక‌రించే వ‌ర‌కు సీఐడికి అప్ప‌గించాల‌ని పేర్కొన్న‌ది. తిరున‌ల్‌వెళ్లికి చెందిన‌ సీబీ-సీఐడీ డీఎస్పీ అనిల్ కుమార్ .. ఈ కేసును విచారించాల‌ని కోర్టు ఆదేశించింది.

జయరాజ్, ఫెనిక్స్ మరణాల నేపథ్యంలో పోలీసు అధికారులు అయారాజ్,బెన్నిక్స్‌ను అరెస్ట్ చేశారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 188, 353, 269, 506 (2) కింద కేసులు నమోదు చేశారు. లాకప్‌లో తండ్రి కొడుకులు జయరాజ్, ఫెనిక్స్‌ను దారుణంగా హింసించారు. వారి ప్రాణాలకు ముప్పు కలగడంతో వారిని హస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే వారిద్దరూ మరణించారని వైద్యులు ధృవీకరించారు. లాకప్‌లో రక్తం కారుతున్నప్పటికీ వారిని దారుణంగా కొట్టారు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

పోస్టుమార్ట‌మ్ నివేదిక‌, జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా.. స‌త్తానుకులం పోలీసుల‌పై హ‌త్య అభియోగం న‌మోదు చేసేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్న‌ట్లు ఇప్ప‌టికే మ‌ద్రాసు హైకోర్టు పేర్కొన్న‌ది. ఐపీసీ 302 ప్ర‌కారం పోలీసుల‌పై కేసు నమోదు చేయ‌వ‌చ్చు అని కోర్టు చెప్పింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచే సీఐడీ విచార‌ణ జ‌ర‌గాల‌ని డివిజ‌న్ బెంచ్ స‌భ్యులైన జ‌స్టిస్ పీఎన్ ప్ర‌కాశ్‌, బీ పుగ‌లేందిలు తీర్పునిచ్చారు. కావాల‌నుకుంటే ఈ కేసుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకి కూడా అప్ప‌గించ‌వ‌చ్చు అని కోర్టు పేర్కొన్న‌ది.