Game Changer Movie Update: శ‌ర‌వేగంగా రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ షూటింగ్, ఇవాళ హైద‌రాబాద్ లో కీల‌క సీన్స్ షూట్ చేయ‌నున్న శంక‌ర్, ఎక్క‌డంటే? నెక్ట్స్ షెడ్యూల్ ఎప్ప‌టి నుంచి మొద‌ల‌వుతుందంటే?

నేటితో ఈ షెడ్యూల్ ముగుస్తుందని తెలుస్తుంది. ఇంకా షూటింగ్ మిగిలి ఉందని, నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ లో ఉంటుందని సమాచారం. దీంతో ఇంకా షూటింగ్ అవ్వలేదా, ఎన్నాళ్ళు చేస్తారు అంటూ చరణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Game Changer (Credits: Twitter)

Hyderabad, March 26: శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండేళ్లకు పైగా ఈ సినిమా సాగుతూనే ఉంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ శరవేగంగా (Game Changer Movie Update) జరుగుతుంది. ఇటీవలే వైజాగ్ లో కొన్ని రోజులు షూట్ చేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ షూట్ నుంచి పలు వీడియోలు, చరణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ (Game Changer Movie Update) హైదరాబాద్ లో జరుగుతుంది. నేడు గచ్చిబౌలిలో కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారు. నేటితో ఈ షెడ్యూల్ ముగుస్తుందని తెలుస్తుంది. ఇంకా షూటింగ్ మిగిలి ఉందని, నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ లో ఉంటుందని సమాచారం. దీంతో ఇంకా షూటింగ్ అవ్వలేదా, ఎన్నాళ్ళు చేస్తారు అంటూ చరణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

SS-Rajamouli-Earthquake: భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్న దర్శకధీరుడు రాజమౌళి, 28వ ఫ్లోర్ లో ఉండగా ఒక్కసారిగా కంపించిన భూమి, జక్కన్న ఫ్యామిలీ మొత్తానికి తప్పిన ముప్పు, వైరల్ గా మారిన కార్తికేయ ట్వీట్ 

ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్, సునీల్, అంజలి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఓ IAS ఆఫీసర్ కి పొలిటీషియన్స్ కి మధ్య అవినీతి గురించి జరిగే కథ అని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి జరగండి.. జరగండి.. అనే సాంగ్ ని మార్చ్ 27 చరణ్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవ్వొచ్చని సమాచారం. చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.



సంబంధిత వార్తలు

Cyclone 'Fengal' Update: వణికిస్తున్న'ఫెంగల్' తుఫాను.. తమిళనాడు సహా దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. తూర్పు తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు

Cyclone Fengal Update: తీరం దాటిన ఫెంగ‌ల్ తుఫాన్, త‌మిళ‌నాడు, ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం

Cyclone Fengal Live Update: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫానుతో వణుకుతున్న తమిళనాడు, ఏపీలో కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక, ప్రస్తుతం సైక్లోన్ ఎక్కడ ఉందంటే..