Krishnam Raju Last Rites: లక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు, ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు
లక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు (Krishnam Raju Final Rites) పూర్తి అయ్యాయి.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
లక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు (Krishnam Raju Final Rites) పూర్తి అయ్యాయి.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటివద్ద ఉంచిన భౌతికకాయానికి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నుంచి మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు (Krishnam Raju Last Rites) పూర్తయ్యాయి.
ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఒంటిగంట తర్వాత జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రకు రోడ్డు పొడవునా అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇక తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఫామ్ హౌజ్‌కు వచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో పార్థివదేహాన్ని సందర్శించుకోలేకపోయిన సినీ ప్రముఖులు కృష్ణం రాజు చివరి చూపుకోసం మొయినాబాద్‌కు పెద్ద ఎత్తున వచ్చారు.
ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా అంత్యక్రియలకు కేవలం కుటుంబసభ్యులు,బంధువులకు మాత్రమే అనుమతించారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తొలుత భావించినా, పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు.