RRR trailer Out Now: ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రిలీజ్, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న సీన్స్, పోటీపడి నటించిన స్టార్స్, థియేటర్స్ లో రచ్చ రచ్చ
ఒక్కో సీన్ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్రవేసేలా అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలకు తగ్గట్లుగా జక్కన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
Hyderabad December 09: ఫ్యాన్స్ కు విజువల్స్ ఫీస్ట్ ఇచ్చాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli). కేవలం తెలుగు సినీ అభిమానులే కాదు, మొత్తం సినీ లవర్స్ ఆతృతగా వేచి చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ (RRR) ట్రైలర్ రిలీజ్(RRR Trailer Launched) అయింది. థియేటర్స్ లో రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు (RRR Trailer Released in Theaters) అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యంగ్ టైగర్ ఎన్డీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పాత్రలను గొప్పగా తీర్చిదిద్దారు.
ట్రైలర్ చూస్తుంటే ఒకరిపై ఒకరు పోటీ పడి నటించినట్లు కనిపిస్తోంది. ఒక్కో సీన్ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్రవేసేలా అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇద్దరు స్టార్ RRR trailer Out Nowహీరోలకు తగ్గట్లుగా జక్కన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతుండగా, ఇక నుంచి వాటిని మరింత వేగవంతం చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నంగా ఆర్ఆర్ఆర్ సినిమాని తీసారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించారు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అలాగే అమెరికాలో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. అక్కడ ఉన్న మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ గ్రాండ్ రిలీజ్ కానుంది. యూఎస్ లో సినిమార్క్ కు దాదాపుగా 350 మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి. వాటిలో 288 సినిమార్క్ మల్టీ ప్లెక్స్ ల్లో వెయ్యికి పైగా స్క్రీన్స్ ల్లో మొదటి మూడు రోజులు ఆర్ఆర్ఆర్ ఆడనుంది తెలుస్తుంది.