ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన సంగతి విదితమే. వరదల్లో (Andhra Pradesh Floods) చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరూ ఆర్థికంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడు తక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు
Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.
— Jr NTR (@tarak9999) December 1, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)