Ruler First Song Released: రూలర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, అడుగడుగో యాక్షన్ హీరో..అరే దేఖో యారో.. అంటూ పల్లవి, పవర్ పుల్ పోలీసాఫీసర్‌గా బాలయ్య, డిసెంబర్ 20న సినిమా విడుదల

కె.ఎస్ రవికుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసినట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ruler-first-lyrical-adugadugo-action-hero-released (Photo-Twitter)

Hyderabad, December 1: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం రూలర్ (Ruler).. కె.ఎస్ రవికుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసినట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కలయికలో వస్తున్న‘రూలర్’ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయ్యింది.ప్రస్తుతం మూవీ టీమ్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. చిరంతన్ భట్(Chirantan Bhatt) సంగీతం అందించగా నిర్మాతగా సీ కళ్యాణ్ (C Kalyan) వ్యవహరిస్తున్నారు.

Ruler First Song 

అయితే ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను(Ruler First Song Released) కేవలం లిరిక్స్ తో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అడుగడుగో యాక్షన్ హీరో(Here Comes Action Hero) ..అరే దేఖో యారో అంటూ సాగే పల్లవితో ఈ పాట అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చూపుల్లోనా వీడు క్లాసు..మనసే బీసీ సెంటర్ బాసూ..పక్కా వైట్ కాలరు..కార్పోరేట్ లీడరు..అంటూ బాలయ్యను ఉద్దేశించి రామజోగయ్యశాస్త్రి(Ramajogayya Sastry) రాసిన సాహిత్యం అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది.

Ruler Teaser

రూలర్ మోషన్ పోస్టర్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో ఈ పాట వినిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 15వ తేదీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.