S P Balu Health Update: గుడ్ న్యూస్..ఎస్ పీ బాలుకు కరోనా నెగెటివ్, ఇంకా వెంటిలేటర్‌ మీదనే ఉన్నారని తెలిపిన కుమారుడు ఎస్పీ చరణ్, ఐప్యాడ్‌లో టెన్నిస్‌, క్రికెట్‌ మ్యాచ్‌లను చూస్తున్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

అయితే 74 ఏళ్ల గాయకుడు బాలు ఇప్పటికీ వెంటిలేటర్‌లో ఉన్నారని కుమారుడు చరణ్ తెలిపారు.

SP Charan on SPB's health (video Grab and Twitter)

చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) సోమవారం మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ (S P Balasubrahmanyam Tests Negative For COVID-19) వచ్చినట్లు ఆయన కుమారుడు ఎస్ పి చరణ్ (S P Charan) తెలిపారు. అయితే 74 ఏళ్ల గాయకుడు బాలు ఇప్పటికీ వెంటిలేటర్‌లో ఉన్నారని కుమారుడు చరణ్ తెలిపారు.

ఎస్‌పిబి కుమారుడు ఎస్పీ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ, నాన్న గారికి కరోనా నెగిటివ్‌గా వచ్చింది. కాకపోతే ఆయన ఊపిరితితత్తుల ఇన్‌ఫెక్షన్‌ నయం కావడానికి మరి కొద్ది కాలం పడుతుంది. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాన్నగారు స్పృహలోనే ఉన్నారు. స్పందిస్తున్నారు. తన ఐప్యాడ్‌లో ఆయన టెన్నిస్‌, క్రికెట్‌ మ్యాచ్‌లను చూస్తున్నారు’ అని తెలిపారు చరణ్‌. అంతేకాక ప్రస్తుతం ఎలాంటి సెడెషన్‌ ఇవ్వటం లేదని తెలిపిన ఎస్పీ చరణ్ ఫిజియో థెరపి మాత్రం కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

Here's SP Charan Tweet

 

View this post on Instagram

 

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on

కరోనాతో ఆగస్టు 5 న చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో బాలును చేర్చారు. ఆగస్టు నెలలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంను ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అటు, కరోనా బారిన పడిన బాలు భార్య కూడా చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటున్నారు.

ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం త‌న 51వ వార్షికోత్స‌వాన్ని ఆసుప‌త్రిలో జ‌రుపుకున్న‌ట్లు స‌మాచారం. వైద్యుల స‌మక్షంలో, అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ బాలు దంప‌తులు శ‌నివారం సాయంత్రం పెళ్లిరోజును జ‌రుపుకున్నట్లు తెలుస్తోంది.