దేశంలో మహమ్మారి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు వైరస్ (Coronavirus) సోకగా, తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా (SP Balasubrahmanyam Tests Positive for Coronavirus) నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్, అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చుకున్నా అంటూ వీడియో
గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నట్లు, వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అందరి అశీస్సులతో తొందరలోనే కోలుకుంటానని వీడియోలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
Share to Twitter
ఈ సమయంలో విశ్రాంతి అవసరమని డాక్టర్స్ సూచించారు. దయచేసి ఎవరు కాల్స్ చేయవద్దు అంటూ బాలు వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో డైరక్టర్స్ రాజమౌళి, తేజ వంటి వారు కరోనా బారీన పడ్డారు.