Hyderabad, August 3: ఇటీవల దర్మక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్‌గా (Director Teja Test Corona Positive) నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియాలో (Social Media) వెల్లడించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో తేజ పాల్గొన్నారు. అనంతరం షూటింగ్ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్దారణ పరీక్షలు (Coronavirus tests) నిర్వహించుకోగా తేజకు పాజిటివ్‌గా తేలింది. ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్, కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లోకి, కోలుకోగానే ప్లాస్మా దానం చేస్తామని తెలిపిన దర్శక ధీరుడు
ఈ విషయంపై తేజ స్పందిస్తూ.. ‘అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చుకున్నా. మా షూటింగ్‌లో సభ్యులకు గానీ, మా కుటుంబసభ్యులకు ఎవరికీ కరోనా రాలేదు. నా ఒక్కడికే కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నా’ అని వీడియో ద్వారా తెలిపారు. మరోవైపు తేజకు కరోనా సోకిన విషయం తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Here's Teja Speech Video
Director @tejagaru about spreading #CoronavirusIndia. #StaySafe pic.twitter.com/lD9R1ZtPtM
— Vamsi Shekar (@UrsVamsiShekar) June 12, 2020
ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తేజ నెల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన తేజ.. ఇప్పుడు ఆ మహమ్మారి బారిన పడటం గమనార్హం