Salaar 2 Movie Shoot Begings: డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్, స‌లార్ -2 షూటింగ్ మొద‌లైంది,శౌర్యాంగ ప‌ర్వం చారిత్ర‌త్మ‌కంగా ఉండ‌బోతుందంటూ నిర్మాణ సంస్థ ట్వీట్

దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు తీపి క‌బురు అందించిన‌ట్లు అయ్యింది. స‌లార్ 2 ‘శౌర్యాంగ పర్వం’ అంటూ రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

prabhas-salaar-2

Hyderabad, NOV 08: బాహుబలి తర్వాత ‘సలార్‌’తో ( Salaar) ఆ రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మరోసారి డార్లింగ్‌ (Prabhas) స్టామీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానున్న విష‌యం తెలిసిందే. మొదటి పార్ట్ సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ అంటూ రాగా.. సలార్: పార్ట్ 2-శౌర్యంగ పర్వం అంటూ (Salaar 2) రాబోతుంది.

Salaar 2 Movie Shoot Begings

 

అయితే పార్ట్ 2 అనౌన్స్ చేశారు కానీ ఇప్ప‌టివ‌ర‌కు అయితే సెట్స్ మీద‌కి వెళ్ల‌లేదు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్​ ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా షూటింగ్​కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. సలార్‌2 మొదలైంద‌ని.. ఈ ప్ర‌యాణం అద్భుతంగా సాగుతోందంటూ హోంబలే ఫిల్మ్స్ (Homvbale Films) ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు తీపి క‌బురు అందించిన‌ట్లు అయ్యింది. స‌లార్ 2 ‘శౌర్యాంగ పర్వం’ అంటూ రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Pushpa-2 New Record: వందేళ్ల బాలీవుడ్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన పుష్ప‌, షారూక్ సినిమా కూడా సాధించ‌లేద‌ని రికార్డు సాధించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif