Pushpa New Song Out Now: పుష్ప నుంచి కిర్రాక్ ఐటెమ్‌ సాంగ్ రిలీజ్, హీటెక్కిస్తున్న సమంత పెర్ఫార్మెన్స్, మరోసారి ఇరగదీసిన దేవీశ్రీప్రసాద్

టాలీవుడ్ బ్యూటీ సమంత చేసిన స్పెషల్ సాంగ్‌ ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్. ఉ అంటావా..ఊ ఊ అంటావా( Oo Antava OoOo Antava) అంటూ సాగే ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఊపేస్తోంది. దేవీశ్రీప్రసాద్(Devisri prasad) అందించిన మాస్ ట్యూన్‌....ఉర్రూతలూగిస్తోంది.

Hyderabad December 10: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa) నుంచి మరో సాంగ్ రిలీజ్ (Pushpa song release) అయింది. టాలీవుడ్ బ్యూటీ సమంత చేసిన స్పెషల్ సాంగ్‌ ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్. ఉ అంటావా..ఊ ఊ అంటావా ( Oo Antava OoOo Antava) అంటూ సాగే ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఊపేస్తోంది. దేవీశ్రీప్రసాద్ (Devi sri prasad) అందించిన మాస్ ట్యూన్‌....ఉర్రూతలూగిస్తోంది.

సుకుమార్ (Sukumar), దేవీశ్రీప్రసాద్ (Devisri prasad) కాంబినేషన్‌లో వచ్చిన అన్ని మూవీస్‌లో ఐటెమ్ సాంగ్ హిట్ అయ్యాయి. ఆర్య (Arya) సినిమాలోని అ అంటే అమలాపురం నుంచి మొదలు పెడితే రంగస్టలం (Rangasthalam) మూవీలోని జిగేలు రాణి సాంగ్ వరకు ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు పుష్ప(Pushpa)మూవీ నుంచి వస్తున్న స్పెషల్ సాంగ్ ఉ అంటావా ఊ ఊ అంటావా ( Oo Antava OoOo Antava) కూడా మాస్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సాంగ్‌లో సమంత(Samantha) పెర్ఫార్మ్ చేయడంతో మరింత ఆసక్తి ఏర్పడింది.

ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) అంటూ మొదలైన సాంగ్‌ ‘కోకా కోకా కోకా క‌డితే కొర‌కొర‌మంటూ చూస్తారు..పొట్టి పొట్టీ గౌనే వేస్తే ప‌ట్టీ ప‌ట్టీ చూస్తారు…కోకా కాదు..గౌనూ కాదు..క‌ట్టులోనా ఏముంది..మీ క‌ళ్ల‌లోనే అంతా ఉంది…మీ మ‌గ బుద్దే వంక బుద్దీ..ఉ అంటావా మావ ..ఊ ఊ అంటావా మావ’ అంటూ సాగుతున్న ఈ పాట ఊర‌మాస్ బీట్‌తో థియేట‌ర్ల‌లో ఈల‌లు వేయించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది.

సుకుమార్ (Sukumar), అల్లుఅర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌ లో వస్తున్న హ్యట్రిక్ మూవీ పుష్ప. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది. రష్మి మందన్నా(Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలు, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. డిసెంబర్ 17న పుష్ప ఫస్ట్ పార్ట్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif