Sunny Leone Song Madhuban: సన్నీ లియోన్ మధుబన్ మేన్ రాధికా నాచే సాంగ్ దుమారం, 3 రోజుల్లో లిరిక్స్ మార్చి కొత్త సాంగ్ విడుదల చేస్తామని తెలిపిన సరిగమ, 3 రోజుల్లో ఆ వీడియో తీసేయాలని హోమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్
దీనిపై నిషేధించాలంటూ మధురలోని (యూపీ) హిందూ సంఘాలు, మత గురువులు డిమాండ్ చేస్తున్నారు. పాటలో అసభ్యకరమైన ఆమె నటన హిందువుల మనోభావాలను గాయపరిచే (Madhuban Controversey) విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సన్నీ లియోన్ మధుబన్ మేన్ రాధికా నాచే’ పాటపై దుమారం చెలరేగుతోంది. దీనిపై నిషేధించాలంటూ మధురలోని (యూపీ) హిందూ సంఘాలు, మత గురువులు డిమాండ్ చేస్తున్నారు. పాటలో అసభ్యకరమైన ఆమె నటన హిందువుల మనోభావాలను గాయపరిచే (Madhuban Controversey) విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవతామూర్తి అయిన రాధను అవమానించేలా ఉందంటూ నెటిజన్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడూ మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సన్నీకి వార్నింగ్ ఇచ్చారు. సన్నీ నటించిన ఆ మ్యూజిక్ ఆల్బమ్‌ని (Sunny Leone Song Madhuban) తీసేయడానికి 72 గంటలు సమయం ఇస్తున్నానంటూ సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హోం మంత్రి హెచ్చరించారు. హోం మంత్రి నరోత్తమ్ మాట్లాడుతూ... "ఆ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం. సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలను ఈ విధంగా స్వరపరుచుకోవచ్చు కదా. ఇలాంటి పాటలు మమ్మల్ని బాధపెడతాయి. మూడు రోజుల్లో ఆ వీడియో తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. అంతేకాదు డిజైనర్ సబ్యసాచి పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు.
పైగా ఈ ఆల్బమ్‌ని నిషేధించాలంటూ హిందు పూజారులు కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుపిలోని బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ కూడా ఈ వీడియోని ప్రభుత్వం నిషేధించకపోతే కోర్టుకు వెళ్తాం అంటూ హెచ్చరించారు. నిజానికి "మధుబన్ మే రాధికా నాచే" పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. అయితే ఈ పాట రాధ, కృష్ణుల ప్రేమకు సంబంధించినది. అటువంటి పాటను సన్నీతో అశ్లీలంగా నృత్యం చేయించి తీయడంతోనే వివాదస్పదంగా మారింది.
సన్నీలియోన్ నటించిన ఈ వీడియో మ్యూజిక్ ఆల్బమ్ ను బుధవారం సరేగమ మ్యూజిక్ విడుదల చేసింది. ఇందులో మధుబన్ పాటపైనే ప్రధానంగా వివాదం నెలకొంది. వాస్తవానికి ఈ పాటను తొలిసారిగా 1960లో కోహినూర్ చిత్రంలో మహమ్మద్ రఫీ ఆలపించారు. ‘‘సన్నీలియోన్ వీడియో ఆల్బమ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మేము కోర్టును ఆశ్రయిస్తాం’’ అని సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు. సన్నివేశాల్లో ఆమెను తప్పించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Here's Saregama Tweet
అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ సైతం తీవ్రంగా స్పందించారు. ‘‘పాటలో అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్ చేయడం ద్వారా సన్నీ లియోన్ బ్రిజ్ భూమి (మధుర-బృందావనం) ప్రతిష్ఠను అవమానించారు’’అని పాఠక్ పేర్కొన్నారు. దీనిపై మ్యూజిక్ అల్బమ్ సరిగమ స్పందించింది. ఈ పాటలోని లిరిక్స్ మార్చివేస్తున్నామని ప్రకటించింది. కొత్త సాంగ్ మరో మూడు రోజుల్లోనే విడుదల చేస్తామంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది.