Shatrughan Sinha: కొందరు ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి అడిగారు, రెండవ పెళ్ళిపై నటుడు శత్రుఘ్న సిన్హ కీలక వ్యాఖ్యలు, రెండో భార్యను తెచ్చుకుని నేను పోషించలేనని తెలిపిన సీనియర్ రాజకీయ నేత

ఆయన తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ( He Cannot Afford More Than One Wife) ఆమెను నేను పోషించలేను.

Shatrughan Sinha (File Photo)

బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హ పాలిటిక్స్‌తో బిజీగా మారిన సంగతి విదితమే. అయితే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ ఒక్క భార్య ముద్దని మరో పెళ్లి చేసుకుని రెండో భార్యను (Shatrughan Sinha on 2nd Marriage) తెచ్చుకోవద్దని తెలిపారు. ఆయన తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ( He Cannot Afford More Than One Wife) ఆమెను నేను పోషించలేను.

కొందరు ఆడవాళ్లు నాదగ్గరకు వచ్చి నాపై ఎంతో ఆసక్తి చూపించేవారు. మన చుట్టూ ఎంత నీళ్లున్నా సరే వాటిలో నుంచి చుక్క నీటిని కూడా మనం తాగలేము అన్న వాక్యం గుర్తొచ్చేది అని తెలిపారు. రాత్రిపూట జరిగే విషయం కాదని అది మీరు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడాలన్నారు. వైవాహిక బంధంలో భార్యభర్తల మధ్య నిజాయితీ ఉండాలి, గౌరవం, ప్రేమ అనేవి ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకర్నొకరు అర్థం చేసుకుని నమ్మకంగా మెదలాలని సూచించారు.

తెలుగు ఫ్లాగ్ అంటే తెలుగు జాతి, ముందు తెలుగోడి సత్తా తెలుసుకుని మాట్లాడు, ఆద్నాన్ సమీపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు

అందరూ సింగిల్‌ లైఫే బాగుంటుందంటారు, కానీ పెళ్లి తర్వాత బాగుందనో, పెళ్లి జీవితం సంతోషంగా ఉందనో ఎవరూ చెప్పరు. నా విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా నా భార్య సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో నా భార్యే ఎక్కువ నిజాయితీగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈజీగా పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు.

తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్

ఈ విడాకుల వల్ల వారి కుటుంబంపై, పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్‌ పడుతుందో గ్రహించలేకపోతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా శత్రుఘ్న సిన్హ, పూనమ్‌లు 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సోనాక్షి సిన్హ, లవ్‌, కుష్‌ సిన్హలు సంతానం.ఈ రోజుల్లో వివాహాలు విడిపోతున్న తీరు, కుటుంబం, పిల్లలు, వారి స్నేహితులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఆ వ్యక్తులు గ్రహించారో లేదో నాకు తెలియదని చెప్పారు.