IPL Auction 2025 Live

Suicide or Murder: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఇతివృత్తంగా సినిమా, సూసైడ్ ఆర్ మర్డర్ పేరిట తెరకెక్కిస్తున్న బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా, టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ లీడ్ రోల్

కొందరు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు కాని..ఆయన మరణంపై సినిమాలు మాత్రం వస్తున్నాయి. సుశాంత్ మృతిని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా 'సూసైడ్ ఆర్ మర్డర్' ( Suicide or Murder) పేరిట సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.

Suicide or Murder (Photo-Vijay Shekhar Gupta Instagram)

ఇటీవలే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ( Sushant Singh Rajput Suicide) చేసుకోగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలేంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొందరు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు కాని..ఆయన మరణంపై సినిమాలు మాత్రం వస్తున్నాయి. సుశాంత్ మృతిని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా 'సూసైడ్ ఆర్ మర్డర్' ( Suicide or Murder) పేరిట సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు

దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సుశాంత్ పాత్రను ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ తివారీ (Tiktok fame Sachin Tiwari) పోషిస్తున్నాడు. చూడ్డానికి సుశాంత్ లా కనిపించే సచిన్ తివారీకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా (Vijay Shekhar Gupta) వెల్లడించారు. ఇతను టిక్ టాక్ స్టార్ అని తెలుస్తోంది.

Here's Vijay Shekhar Gupta Tweet

 

View this post on Instagram

 

A boy from small town became a Shining Star in the film industry. This is his journey. Introducing @officialtiwarisachin _ as 'The Outsider' in #SuicideOrMurder @vsgbinge @VijayShekhar9 @shamikmaullik @shraddhapandit @vsgmusic #bollywood #nepotismbollywood @abpnewstv @zeenews @aajtak @republicbharatofficial @ndtvindia

A post shared by VIJAY SHEKHAR GUPTA (@iamvijayshekhar) on

ప్రస్తుతానికి సగం స్క్రిప్టు పూర్తయిందని, సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. తమ సినిమా చూస్తే బాలీవుడ్ లో బంధుప్రీతి, సినీ మాఫియాపై ఉన్న సందేహాలు తీరతాయని అన్నారు. ఇందులో సుశాంత్ వ్యవహారమే కాకుండా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరి జీవితాలను కూడా చూపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు