New Delhi, July 16: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై (Sushant Singh Rajput Suicide) సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు బీహార్ ఎంపి పప్పు యాదవ్ (Bihar MP Pappu Yadav) లేఖ పంపారు. బీహార్ ఎంపి పప్పు యాదవ్ రాసిన లేఖను షా జూన్ 16 న సంబంధిత విభాగం ముందుకు తీసుకెళ్లినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా సుషాంత్ మరణించిన సరిగ్గా నెల తరువాత జూలై 14 న పప్పు యాదవ్ అమిత్ షా నుండి నిర్ధారణ లేఖను పంచుకున్నారు. తాను రాసిన లేఖపై అమిత్ షా సానుకూలంగా స్పందించారని ఆ లేఖను హోం మంత్రి సంబంధిత విభాగానికి పంపారని పప్పు యాదవ్ తెలిపారు.
సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) 2020 జూన్ 14 న తన బాంద్రా ఇంటిలో ఉరివేసుకున్నట్లు గుర్తించారు మరియు ముంబై పోలీసులు ఈ నటుడు ఆత్మహత్యతో మరణించినట్లు ప్రకటించారు. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ కేంద్ర క్యాబిన్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అతను తన న్యాయవాది ద్వారా ముంబై పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాశాడు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం కమిషనర్ అన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలను పంపాలని లేఖలో ఆయన అభ్యర్థించారు.
Here's Bihar MP Tweet
अमित शाह जी आप चाहें तो एक मिनट में सुशांत मामले की CBI जांच हो सकती है। इसे टालें नहीं!
बिहार के गौरव फ़िल्म अभिनेता सुशांत सिंह राजपूत जी की संदिग्ध मृत्यु की CBI जांच के लिए केंद्रीय गृह मंत्री जी को पत्र लिख आग्रह किया था।
उन्होंने कार्रवाई के लिए पत्र अग्रसारित कर दिया है। pic.twitter.com/MWsFBFNN8p
— Sewak Pappu Yadav (@pappuyadavjapl) July 14, 2020
సుశాంత్ మరణంపై దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి #CBIForSushant పేరిట ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. శేఖర్ సుమన్, బిజెపి ఎంపి రూప గంగూలీ వంటి వివిధ ప్రముఖులు ఈ విషయంపై సిబిఐ దర్యాప్తును చాలా కాలం నుండి కోరారు. సుశాంత్ అకాల మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని శేఖర్ సుమన్ పేర్కొంటుండగా, రూపా గంగూలీ సుశాంత్ యొక్క సోషల్ మీడియా ఖాతాను దెబ్బతీశారని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని మర్డర్ చేశారు, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, సిబీఐ విచారణ జరిపించాలని కోరిన జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పూ యాదవ్
ఇదిలా ఉంటే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఎట్టకేలకు నోరు విప్పారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ ఆమె కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జూన్ 14వ తేదీన ముంబై నివాసంలో సుశాంత్ విగత జీవిగా కనిపించారు. కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, నిరాశలో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు. కేసు విచారణను ముంబై పోలీసులు చేపట్టారు.
Take a look at the post shared by Rhea here:
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తన పోస్ట్‌లో రియా తనను తాను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా పేర్కొంది. లేఖలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. గౌరవనీయమైన అమిత్ షా సార్, నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. సుశాంత్ ఆకస్మిక మరణం చెంది నెల రోజులు దాటింది. కేసు దర్యాప్తులో ప్రభుత్వ విచారణపై పూర్తి నమ్మకం ఉంది. కాగా న్యాయం కోసం ఈ విషయంలో సీబీఐ విచారణ చేయాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఒత్తిళ్లు ఏమిటో తాను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే అంటు రియా లేఖను ముగించారు.
Take a look at her post here:
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అభిమానులకి పీడకలగా మారింది. ఆయన మరణాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్‌లో ఉన్న కొందరు ప్రముఖుల వలననే సుశాంత్ మరణించాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారిని ఎండగడుతున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తూ కంటిపై నిద్రలేకుండా చేస్తున్నారు. సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సుశాంత్ మరణానికి కారణం అని అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. 'పుట్టుక, చావు మన చేతుల్లో లేవు కానీ ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉంది'! కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్
సుశాంత్ మరణించి నెల రోజులు పూర్తైన సందర్భంగా రియా ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో వారు ఆమెని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులకి దిగారు. నువ్వు చచ్చిపో లేదంటే ఏదో ఒక రోజు మేమే చంపేస్తాం అని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని రియా తన సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకొచ్చింది. "నన్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, సహించాను. హంతకురాలని అన్నారు సైలెంట్‌గా ఉన్నాను. సిగ్గు లేదని తిట్టారు భరించాను.
కాని ఆత్మహత్య చేసుకొని చనిపోకపోతే నన్ను రేప్ చేసి చంపేస్తామని బెదిరించడం ఎంత వరకు కరెక్ట్. అసలు మీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారు. ఇది ఎంత పెద్ద నేరమో మీకు అర్ధమవుతుందా? ఇలాంటి చెత్త పనులు మానుకోండి. జరిగినవి చాలు..ఇక ఆపేయండి అంటూ రియా తన పోస్ట్‌లో పేర్కొంది. సైబర్ క్రైమ్ పోలీసులని కూడా ట్యాగ్ చేసిన రియా వారిపై చర్యలు తీసుకోమని కోరింది.