Patna, June 15: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో నిన్న ఉరి వేసుకుని చనిపోయిన (Sushant Singh Rajput's Death) విషయం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ హీరో మరణంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ను మర్డర్ చేశారని జన్ అధికార్ పార్టీ (Jan Adhikar Party) చీఫ్ పప్పూ యాదవ్ ఆరోపించారు. పాట్నాలోని సుశాంత్ ఇంటికి వెళ్లిన పప్పూ యాదవ్ (Pappu Yadav) అక్కడ మీడియాతో మాట్లాడుతూ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదన్నాడు. సుశాంత్ మరణం కేసులో సీబీఐ విచారణ (CBI Inquiry) చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్
పాట్నాలో ఉన్న సుశాంత్ (Sushant Singh Rajput) కుటుంబసభ్యులు కూడా హీరో మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్లు మేం భావించడం లేదని సుశాంత్ బాబాయ్ తెలిపారు. సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని, మా వాడిని మర్డర్ చేశారని ఆయన ఆరోపించారు. సుశాంత్ రాజ్‌పూత్ మృతిపై బిహార్‌లోని ఆయన నివాసప్రాంతంలో ఉండే సన్నిహతులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిలో ఎవరికీ తెలియని కుట్రదాగి ఉందని సందేహించారు.
కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. నిన్న సుశాంత్ మరణం సినీ, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు.
కాగా ఎంఎస్ ధోనీ, చిచ్చోరే, కేదార్‌నాథ్, సోంచిడియా లాంటి ఫేమస్ చిత్రాల్లో సుశాంత్ హీరో పాత్ర పోషించాడు.