Mahesh Babu on Rajamouli Movie: రాజమౌళి సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు, షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానంటూ..

తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు

Mahesh Babu, RRR Director SS Rajamouli (Photo Credits: Twitter)

సూపర్‌స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు.నన్ను ప్రభావితం చేసి నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు మురారి,పోకిరి,శ్రీమంతుడు. ఈ మూవీస్.. నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి.

ఈ మూడింటిలానే ఆడియెన్స్‌కి నచ్చేలా, నైతిక అంశాలు ఉండేలాంటి కథల్ని ఎంపిక చేసకుంటూ వస్తున్నాను. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో సినిమా సక్సెస్ కావడంపై నా ఆలోచన విధాం కూడా మారింది. ఓ మూవీ హిట్ కావడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది కూడా అంతే ముఖ్యమని అన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్ట్‌కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందుకే తగ్గట్లే మహేశ్.. షూటింగ్ కి సిద్ధమవుతున్నారు.

తెలుగు సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు నెగిటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఓ నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేను ఓ సినిమాని అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు లొంగిపోతాతను. దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతాను. ఆ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు.. ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నారని మహేష్ అన్నారు. జంగిల్ అడ్వంచర్ స్టోరీతో తీస‍్తున్న ఈ మూవీ కోసం మహేశ్ దాదాపు మూడేళ్ల కేటాయించినట్లు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

Free Aadhaar Update Last Date: ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రోసారి గ‌డువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవ‌చ్చంటే?

Bandi Sanjay Reaction on Allu Arjun Arrest: మీ చేత‌గాని త‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా? నిప్పులు చెరిగిన బండి సంజ‌య్