Anil Kapoor (Photo Credits: IANS)

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ మరోసారి సౌత్‌ ఇండియా సినిమాల గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్‌గా ఎదిగానని, బాలీవుడ్‌లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్‌ చిత్రాలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. కాగా యానిమల్‌,ఫైటర్‌ చిత్రాలలో కీలక పాత్రలలో నటించిన బాలీవుడ్ స్టార్ విజయాన్ని అందుకున్నారు.సినిమాలను టాలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ విడదీయకండి. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడండి.' అని అనిల్ కపూర్ అన్నారు.

అనిల్ కపూర్ 1980లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా ‘వంశ వృక్షం’ సినిమాలో హీరోగా నటించి కెరీర్ స్టార్ట్ చేశారు. బాపు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఇప్పటికే పలుమార్లు అనిల్‌ కపూర్‌ చెప్పారు. ఇక గతంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వం వహించిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు.  రష్మిక.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఫోర్బ్స్ ఇండియా గౌరవం నేపథ్యంలో రష్మిక మందన్నకు విజయ్‌ దేవరకొండ అభినందనలు

నన్ను హీరో చేసింది తెలుగువారే. లెజెండరీ డైరెక్టర్ బాపు గారు నన్ను హీరోగా తెలుగు సినిమాతోనే పరిచయం చేశారు. ఆయన వలనే నేను నేడు నటుడిగా మీ ముందు ఇలా ఉన్నాను. మొదటి సినిమాతో ఇక్కడి ఆడియన్స్ ని పలకరించిన నేను.. మళ్ళీ 43 ఏళ్ళ తరువాత ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. రష్మిక నీ లక్ నాకు కలిసి రావాలి. ఇన్నాళ్ల నా రీ ఎంట్రీకి నీ లక్ హెల్ప్ చేయాలి” అంటూ వ్యాఖ్యానించారు.