Sushant Singh Rajput Death Case: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ని చంపేశారు, ఆయన శరీరంపై,మెడపై గాయాలున్నాయంటూ సంచలన విషయం వెలుగులోకి

తాజాగా కూపర్‌ ఆస్పత్రి సిబ్బంది (Mortuary Servant) సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని ముందుకు వచ్చారు. పోస్ట్‌ మార్టమ్‌ చేసేటప్పుడు అతడి శరీరంపై గాయాలున్నాయని చెప్పడం సంచలనం రేపుతోంది.

Sushant Singh Rajput (Photo Credits: Facebook)

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై (Sushant Singh Rajput Death Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూపర్‌ ఆస్పత్రి సిబ్బంది (Mortuary Servant) సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని ముందుకు వచ్చారు. పోస్ట్‌ మార్టమ్‌ చేసేటప్పుడు అతడి శరీరంపై గాయాలున్నాయని చెప్పడం సంచలనం రేపుతోంది. సుశాంత్‌ సింగ్‌ పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్‌ (Roopkumar Shah) మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్‌ చనిపోయినరోజు మా ఆస్పత్రికి ఐదు శవాలు వచ్చాయి.

సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు

అందులో ఒకరైన సుశాంత్‌ శరీరానికి పోస్ట్‌మార్టమ్‌ చేసేందుకు మేము వెళ్లాము. అప్పుడాయన శరీరంపై, మెడపై గాయాలు కనిపించాయి. పోస్ట్‌మార్టమ్‌ ప్రక్రియను వీడియో తీయాల్సింది కానీ అధికారులు కేవలం ఫోటోలు మాత్రమే తీయండని చెప్పారు. దీంతో వారి ఆదేశాల ప్రకారం ఫోటోలు మాత్రమే తీసి పంపామన్నారు.

కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్

కానీ సుశాంత్‌ డెడ్‌బాడీ మొదటిసారి చూసినప్పుడే అది ఆత్మహత్య కాదని, హత్యేనని అర్థమైంది. కానీ అధికారులు వెంటనే ఫోటోలు తీసి డెడ్‌బాడీని పోలీసులకు అప్పజెప్పాలని ఆదేశించడంతో ఆ రాత్రే పోస్ట్‌మార్టమ్‌ కంప్లీట్‌ చేశాం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సుశాంత్‌ మరణంపై చర్చకు దారి తీశాయి.

Here's Statement Video

ఈ క్రమంలో ట్విటర్‌లో #SushantSinghRajput హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. కాగా సుశాంత్‌ సింగ్‌ 2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాని వార్తలు వచ్చాయి.



సంబంధిత వార్తలు