Rapido Allu Arjun Ad: డబ్బు కోసం ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజారుస్తారా, హీరో అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ వెంటనే క్షమాపణలు చెప్పాలి, నోటీసులు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రిప్లై లేకుంటే న్యాయపరంగా ముందుకు వెళతామని హెచ్చరిక
ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే..కఠినంగా వ్యవహరిస్తామని, వెంటనే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ (Rapido, Allu Arjun over advertisement ) ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని సూచించారు.
Hyd, Nov 10: సినీ నటుడు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Telangana RTC MD VC Sajjanar ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే..కఠినంగా వ్యవహరిస్తామని, వెంటనే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ (Rapido, Allu Arjun over advertisement ) ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని సూచించారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్ లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలన్నారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా…వ్యవహరించకూడదన్నారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటిసులకు రిప్లయ్ రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని చెప్పారు.
దీనికి కారణం ర్యాపిడో సంస్థ బైక్ ప్రచారం యాడ్ లో (Rapido bike taxi app) అల్లు అర్జున్ నటిస్తున్నారు. ర్యాపిడో అందిస్తున్న ఆఫర్లు, యానిక్ ఫీచర్లను వివరించడం ఈ యాడ్ ప్రత్యేకత. ఇందులో బన్నీ..దోశ చేస్తూ..ఓ ప్రయాణీకుడికి… Rapido Bike app గురించి చెబుతుంటాడు. వీడియోలో ఆర్టీసీ బస్సును చూపించారు. బస్సులో జనాలు ఇరుకుగా ఎక్కుతుంటారు. ర్యాపిడో బుక్ చేసుకోండి..దోశ తీసినంత సులభంగా…వెళ్లిపోండి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించారు.
Here's AD Video
సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని సూచించారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని సజ్జనార్ హితబోధ చేశారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టీసీతోనే ముడిపడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్టను పెంచుతామన్నారు. నష్టాల నుంచి లాభాల వైపు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అల్లు అర్జున్‌తో పాటు Rapido సంస్థకి ఆర్టీసీ సంస్థ నోటిసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.